Hanuman Chalisa lyrics in Telugu|హనుమాన్ చలిసా సాహిత్యం

Rate this post

Best Hanuman Chalisa lyrics Telugu | హనుమాన్ చలిసా సాహిత్యం తెలుగు TulsiDas Hanuman Chalisa lyrics Telugu | MS Ramarao Hanuman Chalisa lyrics Telugu

Hanuman Chalisa lyrics Telugu
Hanuman Chalisa lyrics Telugu

Tulsidas Hanuman Chalisa in Telugu lyrics

దోహా

శ్రీగురుచరణ సరోజరజ నిజమన ముకుర సుధారి వరణౌ రఘువర విమలయశ జో దాయక ఫలచారి |

బుద్ధిహీన తను జానికే సుమిరౌ పవనకుమార బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార |

చౌపాయీ

జయ హనుమాన జ్ఞానగుణసాగర జయ కపీశ తిహుం లోక ఉజాగర

రామదూత అతులితబలధామా అంజనిపుత్ర పవనసుత నామా

మహావీర విక్రమ బజరంగీ కుమతి నివార సుమతి కే సంగీ

కంచనవరన విరాజ సువేసా కానన కుండల కుంచిత కేశా

హాథ వజ్ర అరు ధ్వజా విరాజై కాంధే మూంజ జనేవూ సాజై

శంకరసువన కేసరీనందన తేజ ప్రతాప మహాజగవందన

విద్యావాన గుణీ అతిచాతుర రామ కాజ కరివే కో ఆతుర

ప్రభు చరిత్ర సునివే కో రసియా రామ లఖన సీతా మన బసియా

సూక్ష్మ రూప ధరి సియహిం దిఖావా వికట రూప ధరి లంక జరావా

భీమ రూప ధరి అసుర సంహారే రామచంద్ర కే కాజ సంవారే

లాయ సంజీవన లఖన జియాయే శ్రీరఘువీర హరషి ఉర లాయే

రఘుపతి కీన్హీ బహుత బడాయీ కహా భరత సమ తుమ ప్రియ భాయీ

సహస వదన తుమ్హరో యస గావైం అస కహి శ్రీపతి కంఠ లగావై

సనకాదిక బ్రహ్మాది మునీశా నారద శారద సహిత అహీశా

యమ కుబేర దిగపాల జహాం తే కవి కోవిద కహి సకే కహాం తే

తుమ ఉపకార సుగ్రీవహిం కీన్హా రామ మిలాయ రాజపద దీన్హా

తుమ్హరో మంత్ర విభీషణ మానా లంకేశ్వర భయే సబ జగ జానా

యుగ సహస్ర యోజన పర భానూ లీల్యో తాహి మధుర ఫల జానూ

ప్రభు ముద్రికా మేలి ముఖమాహీ జలధి లాంఘి గయే అచరజ నాహీం

దుర్గమ కాజ జగత కే జేతే సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే

రామ ద్వారే తుమ రఖవారే హోత న ఆజ్ఞా బిను పైసారే

సబ సుఖ లహై తుమ్హారీ శరణా తుమ రక్షక కాహూ కో డరనా

ఆపన తేజ సంహారో ఆపై తీనోం లోక హాంక తేం కాంపై

భూత పిశాచ నికట నహిం ఆవై మహావీర జబ నామ సునావై

నాసై రోగ హరై సబ పీరా జపత నిరంతర హనుమత వీరా

సంకటసే హనుమాన ఛుడావై మన క్రమ వచన ధ్యాన జో లావై

సబ పర రామ తపస్వీ రాజా తిన కే కాజ సకల తుమ సాజా

ఔర మనోరథ జో కోయీ లావై సోయీ అమిత జీవన ఫల పావై

చారోం యుగ పరతాప తుమ్హారా హై పరసిద్ధ జగత ఉజియారా

సాధు సంత కే తుమ రఖవారే అసుర నికందన రామ దులారే

అష్ట సిద్ధి నవ నిధి కే దాతా అస వర దీన జానకీ మాతా

రామ రసాయన తుమ్హరే పాసా సదా రహో రఘుపతి కే దాసా

తుమ్హరే భజన రామ కో పావై జనమ జనమ కే దుఖ బిసరావై

అంత కాల రఘుపతి పుర జాయీ జహాం జన్మ హరిభక్త కహాయీ

ఔర దేవతా చిత్త న ధరయీ హనుమత సేయి సర్వ సుఖ కరయీ

సంకట హరై మిటై సబ పీరా – జో సుమిరై హనుమత బలబీరా

జై జై జై హనుమాన గోసాయీ కృపా కరహు గురు దేవ కీ నాయీ

జో శత బార పాఠ కర కోయీ ఛూటహి బంది మహా సుఖ హోయీ

జో యహ పఢై హనుమాన చలీసా హోయ సిద్ధి సాఖీ గౌరీసా

తులసీదాస సదా హరి చేరా కీజై నాథ హృదయ మహ డేరా

దోహా

పవనతనయ సంకట హరణ మంగళ మూరతి రూప్ రామ లఖన సీతా సహిత హృదయ బసహు సుర భూప్

Tulsidas Hanuman Chalisa in Telugu lyrics video

MS Ramarao Hanuman Chalisa lyrics in Telugu

శ్రీహనుమాన్ – చాలీసా

రచన & సంగీతం: ఎమ్.ఎస్.రామారావు

***********************

ఆపదామ పహర్తారం దాతారం సర్వ సంపదాం

లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం

హనుమాన్ అంజనా సూనుః వాయుపుత్రో మహా బలహః

రామేష్టః ఫల్గుణ సఖః పింగాక్షో అమిత విక్రమః

ఉధధిక్రమణ శ్చైవ సీతా శోక వినాశకః

లక్ష్మణ ప్రాణదాతాచ దశగ్రీవస్య దర్పః

ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః

స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః

తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీభవేత్

******************************

శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాథక శరణములు

బుద్దిహీనతను కల్గిన తనువులు బుద్భుదములని తెలుపు సత్యములు

శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాథక శరణములు

జయహనుమంత ఙ్ఞాన గుణవందిత జయ పండిత త్రిలోక పూజిత

రామదూత అతులిత బలధామ అంజనీ పుత్ర పవన సుతనామ

ఉదయభానుని మధుర ఫలమని భావన లీల అమృతమును గ్రోలిన

కాంచన వర్ణ విరాజిత వేష కుండలామండిత కుంచిత కేశ

శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాథక శరణములు

రామ సుగ్రీవుల మైత్రిని గొలిపి రాజపదవి సుగ్రీవున నిలిపి

జానకీ పతి ముద్రిక దోడ్కొని జలధిలంఘించి లంక జేరుకొని

సూక్ష్మ రూపమున సీతను జూచి వికట రూపమున లంకను గాల్చి

భీమ రూపమున అసురుల జంపిన రామ కార్యమును సఫలము జేసిన

శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాథక శరణములు

సీత జాడగని వచ్చిన నిను గని శ్రీ రఘువీరుడు కౌగిట నినుగొని

సహస్ర రీతుల నిను గొనియాడగ కాగల కార్యము నీపై నిడగ

వానర సేనతో వారధి దాటి లంకేశునితో తలపడి పోరి

హోరు హోరునా పోరు సాగిన అసురసేనల వరుసన గూల్చిన

శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాథక శరణములు

లక్ష్మణ మూర్ఛతో రాముడడలగ సంజీవి దెచ్చిన ప్రాణ ప్రదాత

రామ లక్ష్మణుల అస్త్రధాటికీ అసురవీరులు అస్తమించిరి

తిరుగులేని శ్రీ రామ బాణము జరిపించెను రావణ సంహారము

ఎదురిలేని ఆ లంకాపురమున ఏలికగా విభీషణు జేసిన

శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాథక శరణములు

సీతారాములు నగవుల గనిరి ముల్లోకాల హారతులందిరి

అంతులేని ఆనందాశృవులే అయోధ్యాపురి పొంగిపొరలె

సీతారాముల సుందర మందిరం శ్రీకాంతుపదం నీ హృదయం

రామ చరిత కర్ణామృత గాన రామ నామ రసామృతపాన

శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాథక శరణములు

దుర్గమమగు ఏ కార్యమైనా సుగమమే యగు నీ కృప జాలిన

కలుగు సుఖములు నిను శరణన్న తొలగు భయములు నీ రక్షణ యున్న

రామ ద్వారపు కాపరివైన నీ కట్టడి మీర బ్రహ్మాదుల తరమా

భూత పిశాచ శాకిని ఢాకిని భయపడి పారు నీ నామ జపము విని

శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాథక శరణములు

ధ్వజావిరాజా వజ్ర శరీరా భుజ బల తేజా గధాధరా

ఈశ్వరాంశ సంభూత పవిత్రా కేసరీ పుత్ర పావన గాత్ర

సనకాదులు బ్రహ్మాది దేవతలు శారద నారద ఆదిశేషులు

యమ కుబేర దిగ్పాలురు కవులు పులకితులైరి నీ కీర్తి గానముల

శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాథక శరణములు

సోదరభరత సమానా యని శ్రీ రాముడు ఎన్నిక గొన్న హానుమా

సాధులపాలిట ఇంద్రుడవన్నా అసురుల పాలిట కాలుడవన్నా

అష్టసిద్ది నవ నిధులకు దాతగ జానకీమాత దీవించెనుగా

రామ రసామృత పానము జేసిన మృత్యుంజయుడవై వెలసినా

శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాథక శరణములు

నీనామ భజన శ్రీరామ రంజన జన్మ జన్మాంతర ధుఃఖ బంజన

ఎచ్చటుండినా రఘువరదాసు చివరకు రాముని చేరుట తెలుసు

ఇతర చింతనలు మనసున మోతలు స్థిరముగ మారుతి సేవలు సుఖములు

ఎందెందున శ్రీరామ కీర్తన అందందున హనుమాను నర్తన

శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాథక శరణములు

శ్రద్దగ దీనిని ఆలకింపుమా శుభమగు ఫలములు కలుగు సుమా

భక్తిమీరగా గానము చేయగ ముక్తి కలుగు గౌరీశులు సాక్షిగ

తులసీదాస హనుమాన్ చాలిసా తెలుగున సుళువుగ నలుగురు పాడగ

పలికిన సీతారాముని పలుకున దోషములున్న మన్నింపుమన్న

శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాథక శరణములు

మంగళ హారతి గొను హనుమంత సీతారామ లక్ష్మణ సమేత

నా అంతరాత్మ నిలుమో అనంత నీవే అంతా శ్రీ హనుమంత ఆ ఆ ఆ

ఓం శాంతిః శాంతిః శాంతిః

MS Ramarao Hanuman Chalisa lyrics in Telugu | ఎం.ఎస్.రామరావు హనుమాన్ చలిసా సాహిత్యం

Pawanaputra Hanuman is the supreme devotee of Lord Shree Rama; devotees get happiness, prosperity, fame, strength, by devotion to Shri Hanuman.

Hanuman Chalisa was first written by Tulsidas ji, which is a feeling of great pleasure in reading or listening; Hanumar is part of Lord Shiva.

Lord Hanuman was a Brahmachari. He spent all his time in Satyuga in the service of Lord Shri Ram, Lord Shri Ram who was an incarnation of Shri Hari Vishnu.

Hanuman ji was blessed with immortality by Mother Sita; Even today, news of their sighting are found everywhere by their devotion.

All the devotees of Hanuman ji sing and listen to the recitation of Hanuman Chalisha with great love.

Leave a Comment

error: Content is protected !!
%d bloggers like this: